కావల్సినవి:
బియ్యం- గ్లాసు
మినపపప్పు- 2 చెంచాలు
సెనగపప్పు- చెంచా
ఆవాలు- అరచెంచా
ధనియాలు- 2 చెంచాలు
నువ్వులు- మూడు చెంచాలు
ఎండుమిర్చి - 8
జీలకర్ర- అర చెంచా
పల్లీలు- 2 చెంచాలు
ఎండు కొబ్బరి తరుగు- 4చెంచాలు
ఉప్పు- తగినంత
నూనె పావుకప్పు
కరివేపాకు- 2 రెబ్బలు
నెయ్యి - 2చెంచాలు
పోపు దినుసులు-2 చెంచాలు
పచ్చిమిర్చి- 4
చిక్కటి చింతపండు గుజ్జు-పావు కప్పు
తయారీ:
- బియ్యాన్ని కడిగి ఒకటిన్నర గ్లాసు నీళ్లుపోసి పొడిపొడిగా ఉడికించుకుని వెడల్పాటి పళ్ళెంలో తీసుకోవాలి.
- ఓ గిన్నెలో చింతపండు గుజ్జును ఉడికించుకోవాలి.
- ఇప్పుడు బాణలిలో నూనె లేకుండా మినపపప్పూ, సెనగపప్పూ, ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, పల్లీలూ, నువ్వులూ, ఎండుకొబ్బరి, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి.
- ఈ దినుసులన్నింటినీ మిక్సీలో తీసుకుని తగినంత ఉప్పు వేసుకుని మరీ మెత్తగా కాకుండా పొడి చేసుకోవాలి. ఉడికించిన అన్నంపై ఈ పొడిని వేసుకోవాలి నెయ్యి, నూనె రెండూ వేడిచేసి తాలింపు దినుసుల్ని వేయించుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి తరుగూ, కరివేపాకు రెబ్బలూ వేయించుకోవాలి.
- తరువాత చింతపండు గుజ్జు కూడా వేసి రెండు నిమిషాల తరువాత ఈ మిశ్రమాన్ని అన్నంపై వేసేయాలి. తాలింపు అంతా కలిసేలా అన్నాన్ని కలిపితే సరిపోతుంది.
No comments:
Post a Comment