Sunday, October 7, 2018

స్వీట్‌ కార్న్‌ సూప్‌







కావాల్సిన పదార్థాలు:

స్వీట్‌ కార్న్‌-1 కప్పు
ఉల్లికాడలు-1/2 కప్పు
కూరగాయలు ఉడికించిన నీళ్ళు- 3 కప్పులు
టమాటా సాస్‌-ఐదు చెంచాలు, 
దాల్చిన చెక్క-కొద్దిగా
జీలకర్ర-1 టేబుల్‌ స్పూన్‌
మిరియాలు- 1 టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయ తరుగు- 1/2 కప్పు
టమాటా -1
పచ్చిమిర్చి -4
ఉప్పు-చిటికెడు
పంచదార -2 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం:


  • ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. 
  • ఒక శుభ్రమైన వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. 
  • ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్కజొన్న లను కూరగాయలు ఉడికించిన నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టాలి. 
  • కొద్ది సేపటి తర్వాత ఉప్పు ఉల్లికాడలు టమాటా సాస్‌ వేసి బాగా మరిగించాలి. సూప్‌ చిక్కగా అవుతుంది. 
  • అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి సూప్‌ని వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా వుంటుంది.

No comments:

Post a Comment