Monday, February 18, 2019

మామిడి హల్వా







కావాల్సిన పదార్ధాలు

  • దోర మామిడికాయలు - 4, 
  • బెల్లం కోరు - 2 కప్పులు
  • కొబ్బరి కోరు - 2 కప్పులు, 
  • నెయ్యి - 2 చెంచాలు
  • జీడిపప్పులు - 24
  • కిస్మిస్ - 24
  • ఏలకులు - 6
  • కుంకుమ పువ్వు - కొంచెం
  • నెయ్యి - 1/2 కప్పు


తయారుచేయు విధానం

  • దోర మామిడి ముక్కలు 1 కప్పు నీరు చేర్చి ఉడికించాలి. 
  • దీనికి బెల్లం నేతిలో వేయించిన కొబ్బరి, జీడిపప్పులు, కిస్మిస్, ఏలకులు అన్నీ చేర్చి ఉడికించాలి. 
  • కుంకుమ పువ్వు వేసి కలుపుతూ ఉండాలి. 
  • గిన్నెనుంచి మిశ్రమం విడిపోతుండగా దింపి ప్లేటుకి నెయ్యి రాసి అందులో పోయాలి. 
  • బాగా ఆరాక ఫ్రిజ్లో పెట్టి తీసి ముక్కలు తింటే మంచి రుచి! వారంపైగా నిల్వ ఉంటుంది.


No comments:

Post a Comment