recipes recipe for buckeyes recipes with chicken recipe for banana bread recipes with ground beef recipe for lasagna recipe for meatloaf recipe for eggnog recipes for christmas recipe for chili
Monday, October 22, 2018
Saturday, October 20, 2018
Monday, October 15, 2018
Saturday, October 13, 2018
Friday, October 12, 2018
Monday, October 8, 2018
Sunday, October 7, 2018
స్వీట్ కార్న్ సూప్
కావాల్సిన పదార్థాలు:
స్వీట్ కార్న్-1 కప్పు
ఉల్లికాడలు-1/2 కప్పు
కూరగాయలు ఉడికించిన నీళ్ళు- 3 కప్పులు
టమాటా సాస్-ఐదు చెంచాలు,
దాల్చిన చెక్క-కొద్దిగా
జీలకర్ర-1 టేబుల్ స్పూన్
మిరియాలు- 1 టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు- 1/2 కప్పు
టమాటా -1
పచ్చిమిర్చి -4
ఉప్పు-చిటికెడు
పంచదార -2 టేబుల్ స్పూన్లు
తయారుచేసే విధానం:
- ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి.
- ఒక శుభ్రమైన వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి.
- ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్కజొన్న లను కూరగాయలు ఉడికించిన నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టాలి.
- కొద్ది సేపటి తర్వాత ఉప్పు ఉల్లికాడలు టమాటా సాస్ వేసి బాగా మరిగించాలి. సూప్ చిక్కగా అవుతుంది.
- అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి సూప్‌ని వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా వుంటుంది.
Thursday, October 4, 2018
పొట్లకాయ పెరుగు పచ్చడి
కావాల్సిన పదార్థాలు:
పొట్లకాయ ముక్కలు -3 కప్పులు
పెరుగు -1 కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -3
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కరివేపాకు - 5 రెబ్బలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఎండుమిర్చి ముక్కలు-1 టేబుల్ స్పూన్
కొత్తిమీర తరుగు -1కప్పు
తయారుచేసే విధానం:
- ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక స్పూన్ నూనె, కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టాలి.
- ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
- పొట్లకాయ ముక్కలు చల్లారాక వాటిని పెరుగు మిశ్రమంలో కలపాలి.
- ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు సిద్ధం చేసుకోవాలి.
- కొద్దిగా చల్లారాక పెరుగు పచ్చడి మిశ్రమంలో పోపును కూడా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి.
- పెరుగు పచ్చడి అన్నంతో పాటు తింటే రుచిగా ఉంటుంది
Subscribe to:
Posts (Atom)