Wednesday, February 6, 2019

ఆవ వంకాయ






కావలసిన పదార్ధములు


  • వంకాయలు - 6
  • సోంపు - 2 స్పూన్లు
  • వాము, మెంతులు - 1 స్పూను
  • ఆవపిండి - 2 స్పూన్లు
  • మసాల పొడి - ఒక స్పూను
  • ఆవ నూనె - 2 స్పూన్లు
  • ఉప్పు - రుచికి తగినంత.


తయారు చేయు విధానం

  • పెనం వేడి చేసి వాము, సోంపు, మెంతులు దోరగా వేగించాలి. 
  • చల్లారిన తర్వాత దంచి బరకగా పొడిచేయాలి. 
  • తర్వాత మసాల పొడి, ఆవపొడి, ఉప్పు వేసి బాగా కలపాలి. 
  • ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకుని తుడిచిన వంకాయలను కత్తితో నిలువుగా గాటుపెట్టి పొడుల మిశ్రమం కూరాలి. 
  • కడాయిలో నూనె వేసి వంకాయలు వరసగా పేర్చి చిన్నమంటపై మూతపెట్టి మగ్గించాలి. 
  • సాంబారు అన్నంతో సైడ్ డిష్గా లేదా అన్నంలో కలుపుకున్నా ఎంతో రుచిగా ఉండే వంటకం ఇది.

No comments:

Post a Comment