Friday, February 15, 2019

ఆలూ పచ్చిబఠానీ చాట్







కావాల్సిన పదార్ధాలు:



  • నూనె- 2 టేబుల్ స్పూన్లు
  • జీలకర్ర-1/2 టీ స్పూన్
  • ఉల్లిపాయలు-సన్నగా తరిగినవి 3/4కప్పు
  • వెల్లుల్లి-సన్నగా తరిగినది ఒక టీస్పూన్
  • అల్లం- సన్నగా తరిగినది ఒక టీస్పూను
  • పచ్చి మిర్చి పేస్టు- ఒక టీ స్పూన్
  • టమాటాలు- సన్నగా తరిగినవి 1 కప్పు
  • పచ్చి బఠాణీ-ఉడికించినవి 1 కప్పు
  • ఆలుగడ్దలు--ఉడికించినవి 1 1/2 కప్పు
  • ఉప్పు-తగినంత, కారం- 1 1/2 టీ స్పూను
  • గరం మసాల-1/2 టీ స్పూను
  • పసుపు-చిటికెడు
  • కొత్తిమీర-సన్నగా తరిగినది 1 టీ స్పూను.


తయారీ విధానం:


  • ముందుగా ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసి వేడి చెయ్యాలి, నూనె వేడెక్కాకా దానిలో జీల కర్ర వేసి చిటపటలాడూతుంటే తరిగిన ఉల్లిపాయలు వేసి కలపాలి, ఉల్లిపాయలు లేత గోధుమ రంగులోకి వచ్చే వరకూ కలుపుతుండాలి, ఇప్పుడు ఉల్లిపాయలకి వెల్లుల్లి, అల్లం,టమాటాలు, పచ్చి మిర్చి పేస్టు వేసి ఒక స్పూను నీళ్ళు కలిపితే టమాటాలు బాగా ఉడుకుతాయి.

  • ఇప్పుడు ఉడికిన టమాటాలని బాగా మెత్తగా అయ్యే వరకూ గరిటెతో మెదిపి, మసాలాలన్నీ బాగా ఉడికాకా దానిలో పచ్చి బఠాణీ, ఆలుగడ్డ కలపాలి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా వేసి బాగా కలపాలి, ఇప్పుడు ఒక కప్పు నీళ్ళు పోసి కూరని బాగా ఉడకనివ్వాలి, ఉడికేటప్పుడు ఆలు గడ్డలని మెదిపితే కూర చిక్కబడుతుంది, అంతే మీ ఆలూ మటర్ కూర తయారు.స్టవ్ ఆపి ఈ కూరని ఒక బౌల్లోకి తీసుకోవాలి, పైన కొత్తిమీరతో గార్నిష్ చేసి వడ్డించడమే.

No comments:

Post a Comment