కావలసిన పదార్ధాలు:
- చిన్న వంకాయలు: 1/2కేజి,
- పల్లీలు: 50గ్రాములు
- నువ్వులు: 50గ్రాములు
- ధనియాలు: 2టీ స్పూన్లు
- అల్లం వెల్లుల్లి పేస్టు: 2టీ స్పూన్లు
- కారం: 11/2టీ స్పూన్
- ఉప్పు: రుచికి తగినంత
- ఉల్లిపాయలు: 2
- కొబ్బరి తురుము: 2టీ స్పూన్లు
- చింతపండు: 50గ్రాములు
- పసుపు: 1/4టీ స్పూన్.
- గ్రేవీ కోసం: కొబ్బరి తురుము, పల్లిల పొడి, అల్లం వెల్లులి పేస్టు, చింతపండు, కారం, పసుపు, ఉప్పు, ఉల్లిపాయలు, కలిపి మిక్సిలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారుచేసుకోవాలి.
- పోపు కోసం: ఎండు మిర్చి: 5 ఆవాలు: ఒక టీ స్పూన్ మినపప్పు : ఒక టీ స్పూన్ పచ్చి సెనగ పప్పు : ఒక టీ స్పూన్ నూనె: కావలసినంత.
తయారు చేయు విధానం
- తొడిమలు తీయకుండా వంకాయలను నాలుగు బాగాలుగా గాట్లు పెట్టి నీళ్ళలో వెయ్యాలి . పల్లీలు, నువ్వులను విడి విడిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి.
- గాటు పెట్టిన వంకాయలను పల్లి , నువ్వుల పొడితో నింపాలి.
- స్టౌ పై పాన్ పెట్టి, పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి కాసేపు వేయించిన తరువాత స్టఫ్ చేసిన వంకాయలు అందులో వేయాలి.
- అయిదు నిమిషాలు బాగా వేగిన తరువాత గ్రేవి కోసం తయారు చేసుకొన్న మసాల పేస్ట్ ను, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి బాగా వుడికినట్టు అనిపించాక చింతపండు రసం పోసి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి.
- చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. చపాతి తో గాని, రైస్ తో గాని సర్వే చేసుకుంటే బాగుంటుంది.
No comments:
Post a Comment