కీష్, గుడ్లు, పాలు లేక ఒకటి-రెండు పొరల చీజ్ కలిగిన మీగడ, మాంసం, కూరగాయలు,సముద్రపు ఆహరం కలిపిన పేస్ట్రి క్రస్ట్. కీష్ ని వేడిగా అయినా చల్లగా అయిన వడ్డించవచ్చు. ఇది ఫ్రెంచ్ వంటకంలో భాగం అయినప్పటికి, వేరే దేశాలలో కూడా ప్రముఖ పార్టీ వంటకంగా పేరు పొందింది. ఈ వంటకం లో రొయ్యలు కీలకమైన పధార్థము.
కావలసిన పదార్ధములు
- తాజా రొయ్యలు - 210 గ్రా
- ఆకుపచ్చని ఉల్లిపాయలు(సన్నగా కోసినవి) 4
- కోసిన తాజా డిల్ - ఒక స్పూన్
- చక్కగా తురిమిన నిమ్మరసం - ఒక స్పూన్
- ఫిలో పేస్ట్రి, - 2 షీట్లు
- గుడ్లు - 4
- కొవ్వు తక్కువున్న పాలు - 1/4 కప్పు.
తయారు చేయు విధానం
- ఇప్పుడు తయారుచేయు విధానం,ముందుగా ఒవెన్ ని 1800C/2000C లో పెట్టుకుందాం.
- మనకు ఇప్పుడు కావల్సింది ఉల్లిపాయలు,బఠానిలు,నిమ్మకాయ రసం మరియు డిల్.
- ఒక గిన్నె తీసుకొని ఈ పధార్థాలన్నిటిని కలిపి ఒక మిశ్రమంలా చేసుకోవాలి.
- ఉల్లిపాయల్ని ఒక గిన్నెలో పెట్టి, ఇప్పుడు వెళ్ళి తాజా డిల్ ని కోయాలి.
- ఆ కోసిన డిల్ ని తీసుకెళ్ళి ఉల్లిపాయలున్న గిన్నెలో వేయాలి.
- ఇప్పుడు మనకి తాజాగా, చక్కగా తురిమిన నిమ్మరసం కావాలి.
- ముక్కలుగా కోసిన ఉల్లిపాయల్ని, డిల్ మరియు నిమ్మరసాన్ని ఒక గిన్నె లో వేసి మిశ్రమంగా తయారు చేసుకోవాలి.
- మనం ముందు తయారుచేసిన రొయ్యలు మరియు బఠానీల మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసి,పధార్ఠాలన్ని బాగా కలిసే దాకా కలపాలి.
- నున్నగా ఉన్న ఉపరితలం మీద ఒక ఫిలో షీటు పర్చాలి.
- ఆ ఫిలో షీటు మీద నూనె చల్లాలి.
- మిగిలిన నూనె, ఫిలో తో కూడా ఇలానే పొరలు చేయాలి.దాని తరువాత ముందే తయారుచేసి ఉంచిన పెనం మీద చివర్లు, అంచులు చూసుకోని ఫిలో ని వరుసలో పెట్టాలి.
- ఇక్కడ మనం 2 గుడ్లు, 2 గుడ్ల తెల్లసొన వాడతాం.
- ఇప్పుడు, ఈ రెండు గుడ్లని మరియు రెండు గుడ్ల తెల్లసొన ని, 1/4 కప్పు పాలని మరియు పర్మేసన్ చీజ్ఞి బాగా గిల కొట్టి కలిపి ఒక మిశ్రమం లా తయారు చేయాలి.
- ఇప్పుడు వెళ్ళాడుతున్న ఫిలో అంచుల్ని పైకి చుట్టాలి మరియు ఆ అంచుల్ని జాగ్రత్తగా, సున్నితం గా చుట్టాలి.
- ఇప్పుడు బేకింగ్ ప్రక్రియ మొదలుపెడదాం.
- దీనిని 35 నిమిషాలు బేక్ చెయ్యాలి లేకపోతే బంగారపు రంగు లో కి వచ్చేవరకైనా బేక్ చేసి, తరువాత మనం ముందు వండుకున్న రొయ్యల్ని కలపాలి.
- వంటకం తినడానికి తయారు అయిపొయింది.
No comments:
Post a Comment