Saturday, February 16, 2019

మామిడి రవ్వ పులిహోర







కావాల్సిన పదార్ధాలు

  • బియ్యపురవ్వ - 4 కప్పులు
  • మామిడికోరు - 2 కప్పులు
  • పసుపు - 1 చెంచా
  • ఎండుమిర్చి - 8
  • నూనె - 1/2 కప్పు
  • కొబ్బరి - 2 చెంచాలు
  • శెనగపప్పు - 1 కప్పు
  • కరివేప - కొంచెం
  • వేరుశెనగ పప్పులు - 1/2 కప్పు
  • ఉప్పు - 4 చెంచాలు
  • మినప్పప్పు - 2 చెంచాలు
  • ఆవాలు - 4
  • జీలకఱ్ఱ - 4 చెంచాలు 
  • అల్లం కోరు - 4 చెంచాలు



తయారుచేయు విధానం

  • పది కప్పుల నీరులో ఉప్పు పసుపు, శెనగపప్పు, మామిడి కోరు వేసి మరగనిచ్చి, తెర్లుతుండగా ఈ రవ్వ పోసి నూనె నాలుగు చెంచాలు వేసి మరగనిచ్చి సన్న సెగని పెట్టాలి. 
  • ఇది బాగా మగ్గాక దింపి ప్రక్కన పెట్టాలి. 
  • నూనె కాగనిచ్చి పోపులు వేయించి ఎండుమిర్చి, వేరుశెనగ పప్పు వేయించి ఈ మిశ్రమంలో పోసి బాగా కలిపి మూత పెట్టి అరగంట ఉంచాలి. 
  • బాగా ఉమ్మగిల్లాక బేసిన్‌లోకి తీసుకుని వడ్డించండి. 

No comments:

Post a Comment