Monday, February 11, 2019

పన్నీర్ పాయసం






ఉత్తరాది వారు ప్రత్యేక పండగలకి చేసుకునే ప్రసిద్ధ తీపి వంటకం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని కూడా పిలుస్తారు. పన్నీర్, పాలు, గట్టిపడిన పాలు, సువాసననిచ్చే ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్లతో తయారుచేస్తారు. దీన్ని పండగలప్పుడే కాక, వ్రతాలప్పుడు కూడా చేస్తారు. గట్టిపర్చిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ల ముక్కలతో, పన్నీర్ కొంచెం ఉప్పుదనం తగులుతూ మంచి రుచిని అందిస్తాయి. దీన్ని చిటికెలో శ్రమలేకుండా తయారుచేయవచ్చు. చల్లగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది. 



కావలసిన పదార్ధములు:


  • తరిగిన పన్నీర్ - 1 కప్పు
  • గట్టిపర్చిన పాలు -1 కప్పు
  • పాలు - 1 లీటరు
  • డ్రై ఫ్రూట్లు
  • ఏలకుల పొడి -1 చెంచా


తయారు చేయు విధానం: 


  •  తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి.
  •  వెంటనే పాలను జతచేయండి. 
  •  5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
  •  గట్టిపాలను కూడా పోసి, మరో అరగంటపాటు కలుపుతూనే ఉండండి.
  • ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
  • డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.
  • బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.
  • తరిగిన బాదం, కిస్మిస్‌లతో పైన గార్నిష్ చేస్తే సరి.

No comments:

Post a Comment