కావాల్సిన పదార్ధాలు
మామిడికాయ కోరు - 5 కప్పులు
ఎండుమిర్చి - 12
పచ్చిమిర్చి - 12
మెంతులు - 1 చెంచా
ఇంగువ - శనగబద్దంత
మినపప్పు, శెనగపప్పు - 1/2 కప్పు
నూనె - 1 కప్పు
ఉప్పు - 3 చెంచాలు
బెల్లం - 1/2 కప్పు
పసుపు - 1 చెంచా
కొబ్బరికోరు - 1 కప్పు
తయారుచేయు విధానం
- ముందుగా పోపులు వేయించి, పచ్చిమిర్చి, కొబ్బరికోరు చేసి వేయించి మిక్సి పట్టి ఉంచాలి.
- మామిడికోరు దీనికి చేర్చి బెల్లం చేర్చి మరలా మిక్సీ పట్టాలి.
- ఇప్పుడు మిగిలిన నూనె మరిగించిన ఇంగువ వేసి పొంగించి ఇంగువ ముక్క తీసి ప్రక్కన పెట్టాలి.
- ఈ నూనెలో రుబ్బిన పచ్చడి వేసి బాగా ఉడకనివ్వాలి.
- నీరు ఇంకిపోయాక గిన్నెనుంచి మిశ్రమం విడిపోతుండగా పచ్చడి దింపి చల్లార్చి జాడీలో పెట్టాలి.
- వారం రోజులు నిల్వ ఉంటుంది.
No comments:
Post a Comment