recipes recipe for buckeyes recipes with chicken recipe for banana bread recipes with ground beef recipe for lasagna recipe for meatloaf recipe for eggnog recipes for christmas recipe for chili
Sunday, December 30, 2018
రొయ్యల ప్రై
కావల్సినవి:
- రొయ్యలు-పావు కేజీ
- పసుపు-అర టీస్పూన్
- గరం మసాల పొడి-అర టీస్పూన్
- ఉప్పుు- రుచికి తగినంత
- ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పుు (చిన్నగా కట్ చేసుకోవాలి)
- కార్న్‌ఫ్లోర్-ఒకటిన్నర టీస్పూన్
- మైదా -ఒక టీస్పూన్
- కారం-ఒక టీస్పూన్
- గుడ్డు- ఒకటి
- అల్లం వెల్లులి పేస్ట్-ఒక టీస్పూను
- కరివేపాకు -రెండు రెమ్మలు
- కొత్తిమీర కొంచెం
- పచ్చిమిర్చి- మూడు (పొడవుగా కట్ చేసుకోవాలి)
- నిమ్మకాయ-ఒకటి
- నూనె-డీప్ ఫ్రైకి తగినంత
- మిరియాల పొడి-అర టీస్పూను
తయారీ :
- రొయ్యలను నిమ్మకాయ రసం, ఉప్పుు, పసుసు వేసి బాగా కలపి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
- కడిగిన రొయ్యల్లో కొంచెం ఉప్పుు, మిరియాల పొడి, మైదా, కార్న్‌ఫ్లోర్, గుడ్డుసొన వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టి నూనె వేసుకుని వేడి చేసి ఒక్కో రొయ్యని తీసుకొంటూ నూనెలో వేసుకోవాలి.
- వీటిని పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి.
- వేగక ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- మరో కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రంగు మారేవరకు వేయించాలి.
- దీంట్లో చిటికెడు పసుపు, అర టీస్పూన్ కారం, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి.
- వీటితో రొయ్యలు రుచిగా ఉంటాయి.
- అర టీస్పూన్ గరంమసాలా వేసి రొయ్యలకు బాగా పట్టేలా తిప్పాలి.
- చివర్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకోవాలి.
చందువా కూరిన కూర
కావలసిన పదార్థాలు:
- చందువాలు - 4
- నూనె - 2 టే.స్పూన్లు
- కారం - 6 టీస్పూన్లు
- జీలకర్ర - 1 టీస్పూను
- ధనియాలు - ఒకటిన్నర టీస్పూను
- లవంగాలు - 3
- మిరియాలు - 10
- పసుపు - అర టీస్పూను
- వెల్లుల్లి - 10
- అల్లం - అంగుళం ముక్క
- దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను
- పసుపు - ఒక టీస్పూను
- చింతపండు పులుసు - 1 టీస్పూను
- చక్కెర - 1 టీస్పూను
- వినెగర్ - 1/3 కప్పు
- కొబ్బరి తురుము - 3 టే.స్పూన్లు
- ఉప్పు - తగినంత.
తయారీ విధానం:
- పైన చెప్పిన మసాలాలు, దినుసులన్నీ కలుపుకుని పెట్టుకోవాలి.
- చేపలను అడ్డంగా కత్తితో లోపలికి కోసుకుని మసాలా కూరాలి.
- వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద రెండు వైపులా వేయించుకోవాలి.
- అంతే మనకి వేడిగా వేడిగా చందువా కూర రెడీ.
Friday, December 28, 2018
Thursday, December 27, 2018
Wednesday, December 26, 2018
Subscribe to:
Posts (Atom)