కావాల్సిన పదార్థాలు :
- పిస్తా పప్పు - 1 కప్పు
- కుంకుమ పువ్వు - కొద్దిగా
- బాదం - అర కప్పు
- పంచదార - ఒకటిన్నర కప్పు
- యాలకులు -5, పాలు - 1 లీటరు
తయారు చేసే విధానం :
- ముందుగా బాదం, పిస్తాలను రెండు రెండు వేరువేరు గిన్నెలలో తీసుకుని 6 గంటల సేపు నానబెట్టాలి.
- ఆరు గంటల తర్వాత గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి.
- పాలను బాగా మరిగించి, మంట తగ్గించి మరికొంత సేపు బాగా పాలు కాయాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా నానబెటట్టుకున్న బాదం, పిస్తాలు, యాలకుల వేసి మొత్తం మిశ్రమాన్ని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఈ పేస్ట్‌ను కాగుతున్న పాలలో వేసి బాగా కలవనివ్వాలి.
- ఇప్పుడు ఆ పాలలో పంచదార వేసి కలుపుకోవాలి.
- తర్వాత చివరగా కొద్దిగా కుంకుమపువ్వు చిలకరించాలి.
- పాలను తక్కువ మంటలోనే ఉడికించాలి.
- పాలు కొద్దిగా చిక్కబడుతున్నప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఈ మిల్క్ షేక్‌ని కాసేపు చల్లారనివ్వాలి.
No comments:
Post a Comment