కావల్సినవి :
- యాపిల్ ముక్కలు : 2 కప్పులు
- పుచ్చకాయ ముక్కలు : 4
- అరటిపండు ముక్కలు :5
- పిస్తా పప్పులు : 6
- బాదం : 6
- ఎండుద్రాక్షలు : 10
- పాలు : 1 కప్పు
- పంచదార : 1/2 కప్పు
- తేనె : 1 టేబుల్ స్పూన్
తయారీ :
- ముందుగా యాపిల్ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
- అందులో సగం మిక్సీ జార్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
- ఒక గిన్నెలో యాపిల్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, అరటిపండు ముక్కలు వేసుకోవాలి.
- పాలు వేడి చేసుకుని అందులో పంచదార, తేనె వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
- పాలు చల్లారాక పండ్ల ముక్కల్లో పోయాలి.
- యాపిల్ ముక్కల గుజ్జుని, డ్రైఫ్రూట్స్ కూడా వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
- అంతే ఆపిల్ డ్రై ఫ్రూట్ సలాడ్ రెడీ.
No comments:
Post a Comment