కావలసినవి:
- పాలు ఒక లీటరు
- బాదం పప్పుల ముద్ద పావు కప్పు
- నానబెట్టి తొక్కుతీసి సన్న ముక్కలుగా చేసుకున్న బాదం పప్పులు మరో పావు కప్పు
- సన్న ముక్కలుగా కోసుకున్న పిస్తా పప్పులు 15
- చక్కెర అకప్పు
- కుంకుమ పువ్వు చిటికెడు
- నెయ్యి ఒక టీ స్పూను.
తయారుచేసే విధానం :
- మందంగా ఉండే గిన్నెలో పాలుపోసి సన్నటి సెగమీద ఆపకుండా తిప్పివండాలి.
- కాసేపయ్యాక బాదం ముద్దవేసి పాలపరిమాణం సగానికి తగ్గేదాకా తిప్పుతూ ఉండండి.
- వేరే గిన్నెలో నెయ్యివేసి పొయ్యి మీద పెట్టి బాదం, పిస్తా ముక్కలు బ్రౌన్ రంగు వచ్చేదాకా వేగించి ఆ పాలలో కలపాలి.
- కుంకుమ పువ్వును విడిగా కొంచెం చల్లటి పాలలో కలిపి ఈ మిశ్రమంలో వేయాలి.
- ఇప్పుడు చక్కెర వేసి కరిగేదాకా ఉంచి దించేయండి.
No comments:
Post a Comment