కావల్సినవి:
- రొయ్యలు-పావు కేజీ
- పసుపు-అర టీస్పూన్
- గరం మసాల పొడి-అర టీస్పూన్
- ఉప్పుు- రుచికి తగినంత
- ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పుు (చిన్నగా కట్ చేసుకోవాలి)
- కార్న్‌ఫ్లోర్-ఒకటిన్నర టీస్పూన్
- మైదా -ఒక టీస్పూన్
- కారం-ఒక టీస్పూన్
- గుడ్డు- ఒకటి
- అల్లం వెల్లులి పేస్ట్-ఒక టీస్పూను
- కరివేపాకు -రెండు రెమ్మలు
- కొత్తిమీర కొంచెం
- పచ్చిమిర్చి- మూడు (పొడవుగా కట్ చేసుకోవాలి)
- నిమ్మకాయ-ఒకటి
- నూనె-డీప్ ఫ్రైకి తగినంత
- మిరియాల పొడి-అర టీస్పూను
తయారీ :
- రొయ్యలను నిమ్మకాయ రసం, ఉప్పుు, పసుసు వేసి బాగా కలపి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
- కడిగిన రొయ్యల్లో కొంచెం ఉప్పుు, మిరియాల పొడి, మైదా, కార్న్‌ఫ్లోర్, గుడ్డుసొన వేసి బాగా కలుపుకోవాలి.
- ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టి నూనె వేసుకుని వేడి చేసి ఒక్కో రొయ్యని తీసుకొంటూ నూనెలో వేసుకోవాలి.
- వీటిని పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి.
- వేగక ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
- మరో కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని రంగు మారేవరకు వేయించాలి.
- దీంట్లో చిటికెడు పసుపు, అర టీస్పూన్ కారం, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి.
- ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి.
- వీటితో రొయ్యలు రుచిగా ఉంటాయి.
- అర టీస్పూన్ గరంమసాలా వేసి రొయ్యలకు బాగా పట్టేలా తిప్పాలి.
- చివర్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకోవాలి.
No comments:
Post a Comment