Thursday, December 27, 2018

డ్రైఫ్రూట్స్ బ‌నాన ల‌స్సీ‌







కావల్సినవి :


  • పెరుగు : 1 కప్పు
  • అరటిపండు : 1 (చిన్న ముక్కలుగా కట్‌ చేసుకోవాలి)
  • బాదం : 4,5 (పొడి చేసుకోవాలి)
  • పిస్తాలు : 3,4 (పొడి చేసుకోవాలి)
  • పంచదార : 3 టేబుల్‌ స్పూన్లు
  • రోజ్‌ వాటర్‌ : కొద్దిగా
  • ఐస్‌ క్యూబ్స్‌ : 3,4



తయారీ :


  • ముందుగా ఒక గిన్నెలో పెరుగు వేసి వడకట్టుకోవాలి.
  • తర్వాత దానిని మిక్సీ జార్‌లో వేసి అరటి ముక్కలు, కొద్దిగా నీళ్ళు పోయాలి.
  • అందులోని పంచదార కూడా వేసి గ్రైండ్‌ చేయాలి.
  • ఇలా గ్రైండ్‌ చేసుకొన్న మిశ్రమంలో రెండు మూడు చుక్కలు రోజ్‌ వాటర్‌ వేసి మరోసారి గ్రైండ్‌ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వేరే గిన్నెలోకి వడపోసుకోవాలి.
  • తర్వాత ఒక గ్లాసు తీసుకొని అందులో ఐస్‌ ముక్కలు, లస్సీ, డ్రైఫ్రూట్స్‌ పొడి వేసి గార్నిష్‌ చేయాలి. 
  • అంతే డ్రైఫ్రూట్‌ బనాన లస్సీ రెడీ.

No comments:

Post a Comment