కావల్సినవి :
- రెండు చిన్న యాపిల్స్ (పొట్టుతీసి తురుముకోవాలి)
- రెండు కప్పుల పెరుగు
- అర టీ స్పూను తాజా నిమ్మరసం
- రెండున్నర కప్పులు చల్లటి నీళ్ళు
- మూడు టేబుల్ స్పూన్ల పంచదార మెత్తగా చేసిన ఐస్ అవసరమైనంత.
తయారీ :
- పెరుగు పంచదార, చల్లటి నీళ్లను మిక్సీజార్లో తీసుకుని ఒకసారి తిప్పాలి.
- తయారైన లస్సీకి నిమ్మరసం యాపిల్ కలిపి మళ్లీ పట్టాలి.
- సర్వింగ్ గ్లాసుల్లో మెత్తగా చేసిన ఐస్‌ను వేసి దానిపైన లస్సీ పోయాలి.
- యాపిల్ లస్సీ రెడీ
No comments:
Post a Comment