Wednesday, December 26, 2018

కుకుంబర్‌ లెమనేడ్‌





కావలసినవి : 


  • కీర దోసకాయ (పెద్దది) - ఒకటి
  • నిమ్మరసం - అర కప్పులెమన్‌ జెస్ట్‌ (నిమ్మకాయని తురిమితే వస్తుంది) - ఒక టీస్పూన్‌ లేదా చిన్న నిమ్మకాయ - ఒకటి
  • పంచదార - ముప్పావు కప్పు లేదా తేనె రుచికి సరిపడా
  • మంచి నీళ్లు - ఆరు కప్పులు
  • ఉప్పు - ముప్పావు టీస్పూన్‌(ఇష్టపడితే)
  • ఐస్‌ క్యూబ్స్‌ - కొన్ని.



తయారీ : 


  • కీర దోసకాయను శుభ్రంగా కడిగి తొక్క తీయాలి.
  • కీర దోసకాయను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
  • ఎక్కువ గింజలు ఉంటే తీసేయాలి.
  • బ్లెండర్‌లో రెండు కప్పుల నీళ్లు పోసి కీర ముక్కలు, పంచదార వేయాలి.
  • నాలుగు నిమిషాలు బ్లెండ్‌ చేయాలి.
  • తరువాత డ్రింక్‌ను పెద్దగిన్నెలో వడకట్టి నీళ్లను కలపాలి.
  • ఉప్పు, నిమ్మరసం, ఐస్‌ క్యూబ్స్‌, చిన్న నిమ్మకాయ వేసి బాగా కలపాలి.
  • అవసరమైతే మళ్లీ ఒకసారి వడకట్టాలి.
  • సర్వింగ్‌ గ్లాసుల్లో పోసుకుని మరికొన్ని ఐస్‌క్యూబ్స్‌ వేయాలి.
  • అంతే కీర‌దోస నిమ్మ జ్యూ‌స్ రెడీ.

No comments:

Post a Comment