Saturday, December 19, 2020

వెజ్ మంచూరియా తయారు చేయడం | పాకశాల - Pakashala




 కావాల్సిన పదార్థాలు :


1 : కాలీఫ్లవర్‌ - అర కిలో,

మైదా - రెండు టేబుల్‌ స్పూన్లు, 

మొక్కజొన్న పిండి- ఒకటిన్నర కప్పు, 

కారం - టేబుల్‌ స్పూను,

ఉప్పు - టీస్పూను, 

మిరియాల పొడి - టీస్పూను, 

నీళ్లు - ఒకటిన్నర కప్పు.

2 : వెల్లుల్లి - నాలుగు (సన్నగా తరగాలి), 

అల్లం - అంగుళం ముక్క, 

టమాటా సాస్‌ - మూడు టేబుల్‌ స్పూన్లు, 

చిల్లీ సాస్‌ - టేబుల్‌ స్పూను, 

సోయా సాస్‌ - మూడు టేబుల్‌స్పూన్లు, 

అజినమొటో - టీ స్పూను, 

నూనె - తగినంత.



తయారుచేసే విధానం :

కాలీఫ్లవర్‌ మినహా 1 వ పాయింట్‌లోని అన్ని పదార్థాలను కలిపి చిక్కని పిండిలా కలుపుకోవాలి. అది బజ్జీల పిండిలా ఉండాలి.
ఈ పిండిలో కాలీఫ్లవర్‌ ముక్కలు ముంచి నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి.
పాన్‌లో నూనెపోసి సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి వేగించాలి.

తర్వాత టమోటా, చిల్లీ, సోయా సాస్‌లు, అజినమొటో వేసి బాగా కలపాలి. చివరిగా వేగించిన కాలీఫ్లవర్‌ మరో రెండు నిమిషాలు వేగించాలి. స్ప్రింగ్‌ ఆకారంలో ఆనియన్‌లు తరుక్కుని అలంకరించుకుంటే చాలా బాగుంటుంది.



veg manchurian recipe

veg manchurian gravy

veg manchurian calories

veg manchurian and fried rice recipe

veg manchurian appe pan

veg manchurian at home

మైసూర్‌ బోండా తయారు చేయడం | పాకశాల - Pakashala

Pakashala మైసూర్‌ బోండా

 


కావాల్సిన పదార్థాలు : 

గోధుమపిండి- కప్పు, 
బియ్యం పిండి- రెండు టీ స్పూన్‌లు (వేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి), 
పెరుగు- కప్పు, 
ఉప్పు- రుచికి సరిపడా, 
వంటసోడా - అర టీస్పూన్‌, 
జీలకర్ర- టీ స్పూన్‌, 
పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి)- టేబుల్‌స్పూన్‌, 
అల్లం (సన్నగా తరిగినవి)- టేబుల్‌ స్పూన్‌, 
కరివేపాకు (సన్నగా తరిగినవి)- టేబుల్‌ స్పూన్‌.


   తయారుచేసే విధానం :

ముందుగా గోధుమపిండిలో అన్ని పదార్థాలను వేసి, నీళ్లు లేకుండానే కలుపుకోవాలి. తర్వాత రెండు లేదా మూడు టేబుల్‌స్పూన్స్‌ నీళ్లు వేసుకుని, పలుచగా కాకుండా కలుపుకోవాలి. ఒకవేళ పలుచగా అయితే మరికొంత గోధుమపిండి వేసుకుని, కనీసం రెండు మూడు నిమిషాలు బాగా కలపాలి.


కలిపిన పిండిని రెండు గంటలపాటు నాననివ్వాలి. ఒకవేళ పుల్లటి పెరుగు వాడి ఉంటే గంట నానితే సరిపోతుంది. మరలా రెండు నిమిషాలు బాగా కలపాలి.


గ్యాస్‌ స్టౌ మీద లోతుగా, దళసరిగా ఉండే పాన్‌ను పెట్టుకొని, డీ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మంటను బాగా తగ్గించుకోవాలి.


బోండా వేసేటప్పుడు నూనె ఎక్కువ  వేడిగా ఉంటే బోండా మద్యలో పిండి పచ్చిగా ఉండిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కటిగా బోండాను వేసుకోవాలి. తర్వాత మంటను మీడియంలో పెట్టుకోవాలి. బంగారు వర్ణంలోకి వచ్చిన తర్వాత బయటకు తీస్తే సరిపోతుంది. వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్‌ చేసుకుంటే భలే ఉంటాయి



Tags

Mysore bonda recipe

mysore bonda near me

mysore bonda vahchef

mysore bonda calories

Friday, June 19, 2020

జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala






కావాల్సినవి : 



మైదా - 1 కప్పు,
శనగ పిండి - 1 టేబుల్‌ స్పూన్‌, 


తాజా పెరుగు - 1 కప్పు,
చక్కెర - 1 కప్పు, 



నీరు - 4 కప్పులు,

కుంకుమ పువ్వు - 4-5 రేకలు,
ఫ్రూట్‌ సాల్ట్‌ - చిటికెడు, 



కుంకుమ పువ్వు రంగు - చిటికెడు,
నెయ్యి - 1 కప్పు









తయారీ : 








ఒక బౌల్‌లో మైదాపిండి శనగపిండి, తాజా పెరుగు తీసుకుని ఉండలు లేకుండా గట్టిగా కలపాలి.
కలిపిన పిండిని 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచాలి. 

ఇప్పుడు పొయ్యిమీద మరొక పాన్‌లో పంచదార, నీళ్లు కలిపి పెట్టుకోవాలి. పంచదార కరిగే వరకు 3 నుంచి 5 నిమిషాల వరకు కలుపుతూ ఉండాలి. 

కుంకుమ పువ్వు, ఫుడ్‌ కలర్‌ వేసి తక్కువ మంట మీద బాగా కలపాలి. పిండిలో చిటికెడు ఫ్రూట్‌ సాల్ట్‌ కలపాలి. 

ప్లాస్టిక్‌ స్క్వీజ్‌ బాటిల్‌ తీసుకోండి. మూత తెరిచి పై భాగంలో ఒక గరాటు ఉంచండి. బాటిల్‌లోకి పిండిని గరాటు ద్వారా వేసి బాటిల్‌కి నాజిల్‌ ఉన్న మూతను పెట్టాలి. 

పొయ్యి మీద పాన్‌ పెట్టి నెయ్యి పోసి కరిగించి రెండు నిమిషాలు వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక పిండి వేసుకున్న బాటిల్‌ తీసుకొని బాటిల్‌ని నొక్కుతూ జిలేబి ఆకారం వచ్చేలా వేయాలి. 

జిలేబి రౌండ్స్‌ ఒకదాని తర్వాత ఒకటి వచ్చేలా జాగ్రత్తగా వేయాలి. రెండు వైపులా గోల్డ్‌ కలర్‌ వచ్చేవరకు జాగ్రత్తగా వేగించాలి. 

బాగా వేగిన జిలేబిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఆ జిలేబి మీద పంచదార పాకాన్ని పోసి 30 సెకన్ల పాటు అలానే ఉంచాలి.  ఇక వేడి వేడి జిలేబీలతో పిల్లల్ని ఊరించండి.. మరి.

బ్రెడ్‌ జిలేబి తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసిన పదార్థాలు :




బ్రెడ్‌ ముక్కలు-4, పంచదార-అర కప్పు,
మంచినీళ్లు-అర కప్పు,


యాలకుల పొడి-పావు టీస్పూన్‌,
ఫుడ్‌ కలర్‌-చిటికెడు(ఇష్టపడితేనే),
నూనె-తగినంత.





తయారుచేయు విధానం : 







బ్రెడ్‌ ముక్కలను కుకీ కట్టర్‌తో గుండ్రని బిస్కెట్‌ ఆకారంలో కట్‌ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 


ఒక గిన్నెలో పంచదార వేసి అందులో మంచినీళ్ళు పోసి దాన్ని స్టవ్‌పై పెట్టాలి. 


పంచదార కరిగేవరకు గరిటెతో తిప్పుతూ అయిదు నిమిషాలపాటు మరగనివ్వాలి. 


తరువాత పంచదార పాకాన్ని కిందికి దించి చల్లారాక అందులో ఫుడ్‌ కలర్‌, యాలకుల పొడి కలపాలి. 



స్టవ్‌పై బాణలి ఉంచి, తగినంత నూనె పోసి, అది వేడెక్కాక అందులో గుండ్రంగా కట్‌ చేసుకుని పెట్టుకున్న బ్రెడ్‌ ముక్కలను వేసి సన్నటి మంటపై దోరగా వేగించాలి. 



వేగిన బ్రెడ్‌ ముక్కలను పంచదార పాకంలో వేసి, అయిదు నిమిషాల తర్వాత తీసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్‌ చేయాలి.

Thursday, June 18, 2020

గోరుమీటీలు తయారు చేయడం | పాకశాల - Pakashala

 



కావలసినవి:




మైదా - పావుకేజీ,
బొంబాయి రవ్వ - మూడు టేబుల్‌స్పూన్లు,

వెన్న - రెండు టేబుల్‌స్పూన్లు,
పంచదార - 200 గ్రాములు,


బెల్లం - రెండు టేబుల్‌స్పూన్లు,
యాలకులు - రెండు,



నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా,
నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌,
ఉప్పు - కొద్దిగా.


 



తయారీ విధానం:





ఒక పాత్రలో మైదా పిండి తీసుకొని అందులో వెన్న, కొద్దిగా ఉప్పు వేసి, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.
మిశ్రమం మెత్తగా రావాలంటే కొద్దిగా నూనె వేయాలి. తరువాత రవ్వ కలిపి అరగంటపాటు పక్కన పెట్టుకోవాలి.
పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ బొటనవేలుపై గోరుమీటీలు చేసుకోవాలి.
పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక గోరుమీటీలను వేసి వేగించాలి.
మరొక పాత్రలో అర కప్పు నీళ్లు పోసి పంచదార, బెల్లం పానకం తయారుచేయాలి. అందులో యాలకుల పొడి, నెయ్యి వేయాలి.
ఇప్పుడు వేగించి పెట్టుకున్న గోరుమీటీలను పానకంలో వేయాలి. వీటిని పిల్లలు ఇష్టంగా తింటారు.




పుట్టగొడుగుల పలావు తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసినవి: 


వండిన బాస్మతి అన్నం మూడు కప్పులు,
బటన్‌ మష్రూమ్‌లు 200 గ్రా, 

Monday, June 15, 2020

స్వీట్‌కార్న్‌ పలావ్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala






కావలసినవి : 


బాస్మతీ రైస్‌ - కప్పు, నీళ్లు - 1-1/2 కప్పు ,
స్వీట్‌కార్న్‌ - కప్పు, 


బఠాణీలు- కప్పు, 
ఉల్లిపాయ - 1, 


అల్లం - ముక్క,
పచ్చిమిరప -1, 


వెల్లుల్లి రెబ్బలు - 4,
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు, 


గరం మసాలా - పావు స్పూన్‌,
పసుపు - చిటికెడు, 


దాల్చిన చెక్క - చిన్న ముక్క,
యాలకులు- 2, ఉప్పు, 


కారం - తగినంత,
నిమ్మరసం- కొద్దిగా, 


పుదీనా ఆకులు - కొన్ని,
బిర్యానీ ఆకులు - 2



తయారీ : 


ఉల్లిపాయ, అల్లం, పుదీనా, పచ్చిమిరప, వెల్లుల్లి రెబ్బలను పేస్ట్‌ చేసిపెట్టుకోవాలి. 
కడాయిలో నూనె వేసి అందులో జీలకర్ర, లవంగాలు, బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్కను వేగించాలి. 



ఉల్లి పేస్ట్‌ వేసి దానికి కారం, పసుపు, గరం మసాలాలు కలపాలి. స్వీట్‌కార్న్‌, బఠాణీలు వేసి దోరగా వేగించాలి. 




అందులో నానబెట్టిన రైస్‌ వేసి ఉడికించాలి. ఆఖరున సరిపడా ఉప్పు వేసుకుంటే చాలు తీపి మొక్కజొన్న పలావ్‌ రెడీ. రైతాతో, అప్పడాల కాంబినేషన్లో  ఈ పలావ్‌ తింటే రుచిగా ఉంటుంది


.

రాజ్మా సూప్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala

 


కావలసిన పదార్థాలు : 


రాజ్మా గింజలు - ఒక కప్పు,
సన్నగా తరిగిన ఉల్లిముక్కలు - పావు కప్పు, 


పచ్చిమిర్చి తరుగు - ఒక టేబుల్‌ స్పూను,
వెల్లుల్లి పేస్టు - ఒక టీ స్పూను, 

Saturday, May 2, 2020

రొయ్యల పకోడీ‌ తయారు చేయడం | పాకశాల - Pakashala






కావలసినవి : 


రొయ్యలు-పావుకిలో (శుభ్రంగా కడిగి),
మిక్సింగ్‌ కోసం: ఉప్పు- రెండు టీస్పూన్లు,
శెనగపిండి- ఒక కప్పు,
వెల్లుల్లి పేస్టు-ఒక టీస్పూను,
పసుపు- అర టీస్పూను, 

క్యారెట్‌ కేక్‌‌ తయారు చేయడం | పాకశాల - Pakashala

 









కావలసినవి : 


క్యారెట్‌ తురుము - 200 గ్రా,
మైదా - 125 గ్రా,
బేకింగ్‌ పౌడర్‌ - 1 టీ స్పూను,
బేకింగ్‌ సోడా - అర టీ స్పూను, 

Sunday, April 26, 2020

సీతాఫలం కలాకంద్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala





కావలసిన పదార్థాలు: 







పాలు - రెండు లీటర్లు,
నిమ్మరసం - రెండు టీస్పూన్లు,
పంచదార - రెండు టీస్పూన్లు,
యాలకుల పొడి - రెండు టేబుల్‌స్పూన్లు,
సీతాఫలం గుజ్జు - పావు కప్పు,
నెయ్యి - ఒకకప్పు,
పిస్తా - అరకప్పు,
బాదం - ఐదారు పలుకులు.
సిల్వర్‌ ఫాయిల్‌ - కొద్దిగా.     


తయారీ విధానం: 







రెండు పాన్‌లలో పాలను సమానంగా తీసుకోవాలి. ఒక పాన్‌లోని పాలు సగానికి వచ్చే వరకు మరిగించి పక్కన పెట్టుకోవాలి. 


తరువాత మరో పాన్‌లో ఉన్న పాలను మరిగించాలి. పాలు మరుగుతున్న సమయంలో నిమ్మరసం వేయాలి.
దాంతో పాలు విరిగిపోతాయి. ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి ఒక కాటన్‌ వస్త్రం సహాయంతో పాలు వడబోస్తే పన్నీర్‌ మిగులుతుంది. 


ఈ పన్నీర్‌ను బాగా మరిగించి పెట్టుకున్న పాలలో కలపాలి. మళ్లీ స్టవ్‌పై పెట్టి చిన్నమంటపై కొద్దిసేపు ఉంచాలి.
కాసేపయ్యాక పంచదార, యాలకుల పొడి, సీతాఫలం గుజ్జు వేసి బాగా కలపాలి. ఒక ప్లేట్‌ అడుగున నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం పోయాలి. 


ప్లేట్‌ అంతటా సమంగా వచ్చేలా చూసుకోవాలి. పిస్తా, సిల్వర్‌ ఫాయిల్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.
తరువాత చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసుకుని సర్వ్‌ చేసుకొని తింటే టేస్టీగా ఉంటుంది. 

క్యారెట్ ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala





కావాల్సినవి :




క్యారెట్‌ జ్యూస్‌ - రెండు కప్పులు,
పాలు - రెండు కప్పులు,
చక్కెర - రెండు కప్పులు,
క్రీమ్‌ - ఒక కప్పు,
బాదం, పిస్తాలు - అరకప్పు,
మొక్కజొన్న పిండి - రెండు చెంచాలు






తయారీ :




పాలలో చక్కెర వేసి స్టౌ మీద పెట్టాలి. కొద్ది పాలలో మొక్కజొన్న పిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.
ఈ మిశ్రమాన్ని పాలలో వేసి కలపాలి. పాలు చిక్కగా అయ్యాక క్రీమ్‌ వేసి కలపాలి. 

పది నిమిషాలు మరిగాక క్యారెట్‌ జ్యూస్‌ వేసి కలపాలి. మిశ్రమం మరింత చిక్కగా అయ్యేవరకు మరిగించి దించేసుకోవాలి.



చల్లారాక డీప్‌ ఫ్రీజ్‌లో పెట్టాలి. ఒక గంట తరువాత తీసి మిక్సీలో బాగా బ్లెండ్‌ చెయ్యాలి.
దీనివల్ల ఐస్‌క్రీం మరింత సాఫ్ట్‌గా ఉంటుంది. బ్లెండ్‌ చేశాక దీనిపై బాదం, పిస్తాలను అలకరించుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.



గట్టిబడిన తరువాత ఇక ఆలస్యం చేయకుండా ఆరగించండి.

Tuesday, April 21, 2020

నిమ్మ – పుదీనా డ్రింక్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala



నిమ్మ – పుదీనా డ్రింక్‌

Lemon – Mint Drink




ఎండాకాలం లిక్విడ్లు ఎక్కువగా తాగాలనిపించడం సహజం. అలాంటి వాటిలో నిమ్మ – పుదీనా డ్రింక్‌ ఎంతో మేలు చేస్తుంది. జనరల్‌గా పుదీనా డ్రింక్‌ని రోడ్లపై అమ్ముతుంటారు. ఇప్పుడు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది కాబట్టి ఇలాంటివేవీ రోడ్లపైకనిపించడం లేదు. అయితే బయటి కంటే ఇంట్లో మనమే సొంతంగా చక్కగా నిమ్మపండు- పుదీనా డ్రింక్‌ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు.

కరోనా వైరస్‌ ప్రబలుతున్న ఈ రోజుల్లో ఇలాంటి డ్రింక్‌ తాగితే వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీన్ని ఫ్రిజ్‌లో పెట్టి ఎక్కువగా చల్లగా అయ్యే వరకు పెట్టకూడదు. అసలు చల్లగా లేకుండానే తాగితే ఎంతో మంచిది. ఎందుకంటే ఫ్రిజ్‌లో వచ్చేది సహజమైన కూలింగ్‌ కాదు. అది మన శరీరానికి సెట్‌ కాదు. కూల్‌ వాటర్‌ తాగినా గొంతులో గరగర మంటుంది. అందుకే వీలైనంత వరకు కూలింగ్‌ లేకుండా చూసుకోవాలి.

ఎండలో పనిచేసి బాగా అలసిపోయిన వారు ఈ నిమ్మ – పుదీనా డ్రింక్‌ తాగిగే ఎనర్జీ వస్తుంది. పుదీనా ఆకుల్ని మెత్తగా చేసి అరకప్పు నీళ్లు పోసి 10 సెకండ్ల పాటు మిస్కీలో బ్లెండ్‌ చేయాలి.

దీన్ని వడగట్టి ఆ వచ్చిని రసాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు పుదీనా రసాన్ని తీసుకుని అందులో నిమ్మరసం, ఉప్పువేసి బాగా కలపాలి. ఐస్‌ ముక్కలు వేసుకుని పుదీనా రసాన్ని గ్లాసులో పోసి లిమ్కా, లేదా స్ప్రైట్‌ డ్రింకును ఆ జ్యూస్‌లో చేర్చుకుని తాగాలి. ఇలా చేస్తే చాలా బాగుంటుంది. అతిధులకు అందించేటప్పుడు పొడవాటి గ్లాసులో పుదీనా రసం పోసి ఐస్‌ ముక్కలు వేసి నిమ్మరసం, ఉప్పు కలిపిన ద్రావణాన్ని పోసి, మీకు ఇష్టమైన డ్రింకును చేర్చి అందించవచ్చు. సమ్మర్‌లో చాలా మంది ఈ జ్యూస్‌ తాగుతుంటారు. ఏ డ్రింక్‌ తాగిని మరీ చల్లగా లేకుండా చూసుకోవాలి.

మసాలా ఆవడ తయారు చేయడం | పాకశాల - Pakashala






కావలసిన పదార్థాలు


శెనగపప్పు- అరకప్పు
కందిపప్పు – అరకప్పు
పెసరపప్పు – అరకప్పు
మినప్పప్పు – అరకప్పు
జీడిపప్పు పలుకులు – పావుకప్పు
కొత్తిమీర- ఒక కట్ట
పుదీనా – ఒక కట్ట
పచ్చిమిర్చి – ఆరు
అల్లం – చిన్న ముక్క
కరివేపాకు – రెండు రెబ్బలు
వంటసోడా – పావుచెంచా
ఉప్పు -తగినంత
నూనె వేయించేందుకు సరిపడా తాలింపు కోసం : పెరుగు – మూడు కప్పులు
క్యారెట్‌ తురుము – పావు కప్పు
పచ్చిమిర్చి – రెండు
అల్లం తరుగు – చెంచా
ఉప్పు – తగినంత
ఆవాలు, మినప్పప్పు – చెంచా చొప్పున
నూనె – చెంచా
కొత్తిమీర తరుగు – చెంచా




తయారు చేయువిధానం


శెగపప్పు, మినప్పపు, కందిపప్పు, పెసరపప్పులను రెండు గంటల ముందుగా నీళ్లుపోసి నానబెట్టాలి. తరువాత నీళ్లు వంపేసి మెత్తగా పిండి రుబ్బాలి.


రుబ్బిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అలాగే జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి మిక్సీలో మెత్తగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని సెనపప్పు ముద్దపై వేయాలి. అలాగే తగినంత ఉప్పు, వంటసోడా కూడా వేసుకుని మరోసారి కలపాలి.
ఈ పిండిని చిన్న చిన్న వడల్లా చేసుకుని కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. వీటి వేడడి చల్లారాక వేడి నీటిలో వేసి నిమిషమయ్యాక తీసేయాలి.
ఈ వడల్ని ఇప్పుడు ఉప్పు, అల్లం తరుగు, పచ్చిమిర్చి ముక్కలు కలిపిన పెరుగులో వేసుకోవాలి.
బాణలిని పొయ్యిమీద పెట్టి నూనె వేడిచేసి ఆవాలు, మినప్పప్పు వేయించి దింపేయాలి.
ఈ తాలింపు వేడి చల్లారాక పెరుగుపై వేయాలి.చివరగా క్యారెట్‌ తురుము, కొత్తిమీరతో అలంకరిస్తే సరిపోతుంది.





Saturday, April 11, 2020

వెనిల్లా ఐస్‌క్రీం తయారు చేయడం | పాకశాల - Pakashala




కావల్సినవి : 



గుడ్లు - నాలుగు (పచ్చసొన మాత్రమే తీసుకోవాలి),
చక్కెర - పావుకప్పు,
మొక్కజొన్న పిండి - చెంచా
(కొన్ని పాలతో చిక్కగా చేసుకోవాలి), క్రీమ్‌ - కప్పు,
చిక్కటి పాలు - అరకప్పు, ఉప్పు - చిటికెడు,
వెనిల్లా ఎసెన్స్‌ - చెంచా



తయారీ : 

అడుగు మందంగా ఉండే పాత్రలో పచ్చసొనా, చక్కెర, మిగిలిన పాలూ, మెక్కజొన్న మిశ్రమం తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి.
ఇప్పుడు క్రీమ్‌ వేసి మరోసారి కలపాలి. ఈ పాత్రను సన్నని మంటపై ఉంచి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి.
చిక్కగా అయ్యాక ఉప్పూ, వెనిలా ఎసెన్స్‌ కలిపి దింపేయాలి.
ఇది బాగా చల్లారాక మరో గిన్నెలోకి తీసుకుని డీప్‌ ఫ్రీజర్‌లో ఉంచాలి.
నాలుగైదు గంటలకు గట్టిబడుతుంది. తర్వాత బయటకు తీసి మీకు కావాలనుకుంటే దీనిపై చాక్లెట్‌ పలుకులు వేసుకోవచ్చు.
తర్వాత చల్ల చల్లగా సర్వ్‌ చేయండి.






Thursday, April 9, 2020

కొబ్బరి బూరెలు తయారు చేయడం | పాకశాల - Pakashala


కావలిసినవి ::

బియ్యప్పిండి - కేజీ, 

బెల్లం - ముప్పావు కేజీ, 


కొబ్బరి ముక్కలు - రెండు,
డాల్డా - 100గ్రాములు,
నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా.


 తయారీ విధానం: 

బియ్యాన్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే గ్రైండ్‌ చేయాలి.కొబ్బరి ముక్కలు, బెల్లంను విడిగా గ్రైండర్‌ వేసి పొడి చేసుకోవాలి.
వెడల్పాటి పాన్‌లో బెల్లంను వేడి చేయాలి. బెల్లం త్వరగా కరగడానికి కొద్దిగా నీళ్లు పోయాలి. 
బెల్లం పానకం వేళ్లకు అంటుకున్నట్లుగా ఉండేలా చూసుకోవాలి.ఇప్పుడు ఈ పానకంలో కొబ్బరి పొడి యాలకుల పొడి, డాల్డా వేసి కలియబెట్టాలి.
ఇప్పుడు బియ్యప్పిండి వేసి కలపాలి.తరువాత పిండిని చిన్నచిన్న బూరెల మాదిరిగా ఒత్తుకోవాలి.
పాన్‌లో నూనె పోసి బూరెల్ని గోధుమ రంగులోకి మారే వరకు వేగించాలి.

పనస గింజల వడలు తయారు చేయడం | పాకశాల - Pakashala



 కావలసిన పదార్థాలు: 


పనస గింజలు - 2 కప్పులు, 

బియ్యప్పిండి - ఒక కప్పు, 


పచ్చిమిర్చి - 4, 

పచ్చికొబ్బరి తురుము - ఒక కప్పు, 


ఉల్లి తరుగు - అరకప్పు,
జీలకర్ర - ఒక టీ స్పూను, 


ఉప్పు - రుచికి సరిపడా,
కొత్తిమీర తరుగు - పావుకప్పు, 


అల్లం తరుగు - ఒక టేబుల్‌ స్పూను,
నూనె - వేగించడానికి సరిపడా.


తయారుచేసే విధానం: 


పనస గింజల పై పొట్టు తీసి కుక్కర్లో ఉడికించాలి. 

మిక్సీలో చల్లారిన పనస గింజలు, అల్లం, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి వేసి పేస్టు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి అందులో ఉప్పు, కొత్తిమీర, ఉల్లితరుగు, బియ్యప్పిండి, జీలకర్ర వేసి బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కొంత కొంత తీసుకుని వడలుగా ఒత్తి కాగిన నూనెలో దోరగా రెండువైపులా వేగించుకోవాలి.

ఇష్టమైనవారు ఇదే మిశ్రమాన్ని పకోడీగా కూడా వేసుకోవచ్చు.