Thursday, November 21, 2019

చక్కెర పొంగలి తయారు చేయడం | పాకశాల - Pakashala



కావలసినవి : 


బియ్యం - ఒక కప్పు, 
బెల్లం - ఒకటిన్నర కప్పు, 

పెసరపప్పు - మూడు టేబుల్‌స్పూన్లు, 
నెయ్యి - పావుకప్పు, 

యాలకుల పొడి - పావు టీస్పూన్‌, 
జీడిపప్పు - పది పలుకులు, 

ఎండు ద్రాక్ష - రెండు టేబుల్‌స్పూన్లు, 
పచ్చ కర్పూరం పొడి - చిటికెడు, 

జాజికాయ పొడి - చిటికెడు, 
నీళ్లు - నాలుగు కప్పులు.

తయారీవిధానం : 


బియ్యం, పెసరపప్పును కడిగి కుక్కర్‌లో వేసి నాలుగు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. 
ఒక పాన్‌లో బెల్లం తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. 
బెల్లం పానకం చుక్కను గ్లాసు నీటిలో వేస్తే కరగకుండా అడుగుభాగానికి చేరుకోవాలి. 
అప్పుడు బెల్లం పానకం సరిగ్గా ఉన్నట్టు. తరువాత ఉడికించి పెట్టుకున్న బియ్యం, పెసరపప్పు మిశ్రమాన్ని అందులో వేసి కలపాలి. 
చిన్నమంటపై నాలుగైదు నిమిషాల పాటు ఉడికించాలి. 
ఇప్పుడు నెయ్యి వేసి మరికాసేపు ఉడికించాలి.
యాలకుల పొడి, పచ్చ కర్పూరం పొడి వేసి కలపాలి. 
నెయ్యిలో వేగించిన జాజికాయ పొడి, జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేగించి మిశ్రమంలో కలిపితే... చక్కెర పొంగలి రెడీ.



చికెన్‌ పల్లీ నూడుల్స్‌ తయారు చేయడం | పాకశాల - Pakashala



కావలసిన పదార్థాలు :


నూడుల్స్‌- 2 కప్పులు, 
చికెన్‌- పావు కిలో, 

సన్నగా తరిగిన గుమ్మడికాయ ముక్కలు- అర కప్పు, 
ఉల్లిపాయ- 1, 

క్యారెట్‌- 2, 
గుడ్లు- 2, 

వేగించిన పల్లీలు- అర కప్పు, 
సోయాసాస్‌- 3 టేబుల్‌ స్పూన్లు, 

వెనిగర్‌- ఒక టేబుల్‌ స్పూను, 
చిల్లీసాస్‌- ఒక టేబుల్‌ స్పూను,

కొత్తిమీర- కొద్దిగా,
నూనె- 2 టేబుల్‌ స్పూన్లు, 
కారం, ఉప్పు- తగినంత.

తయారీ విధానం : 


నూడుల్స్‌ను వేడినీటిలో వేసి రెండు నిమిషాల తర్వాత తీసి ఆరబెట్టాలి. 
చికెన్‌ను ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. 
తర్వాత ఒక బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి మూడు నిమిషాలు వేగించి పక్కన పెట్టుకోవాలి. 
ఆ తర్వాత మరో బాణలిలో ఒక టేబుల్‌ స్పూను నూనె పోసి వేడెక్కాక నూడుల్స్‌ వేసి వేగించాలి. 
తర్వాత సోయాసాస్‌, చిల్లీసాస్‌, వెనిగర్‌ వేసి నిమిషం పాటు వేగించాలి.
తర్వాత గుడ్లు పగులకొట్టి వేసి ఉప్పు, కారం కూడా వేసి మరో అరనిమిషం పాటు వేగించాలి. 
ఆ తర్వాత పక్కనపెట్టుకున్న చికెన్‌, క్యారెట్‌, ఉల్లిపాయ, గుమ్మడికాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగించాలి. 
చివరగా పల్లీలు వేసి మరో 2 నిమిషాలు వేగించి కొత్తిమీర జల్లి దించేయాలి.







Saturday, November 9, 2019

మసాలా ఎగ్‌ కర్రీ తయారు చేయడం | పాకశాల - Pakashala


కావలసినవి:


ఉల్లిపాయలు-2,
టమాటాలు-2 , కాప్సికం-1, కోడిగుడ్లు-2
అజినోమోటో-చిటికెడు, సోయాసాస్‌-పావ్ఞటేబుల్‌స్పూన్‌
చిల్లీసాస్‌-అరటేబుల్‌స్పూన్‌,
టమాటాసాస్‌-ఒక టేబుల్‌స్పూన్‌
ఉప్పు-తగినంత,
మిరియాలపొడి-పావ్ఞటేబుల్‌స్పూన్‌
కొత్తిమీర-కొద్దిగా,
నూనె-మూడు టేబుల్‌స్పూన్లు


తయారుచేసే విధానం


కోడిగుడ్లను ఉడికించి పెంకుతీసి కొంచెం పెద్దసైజుముక్కలుగా కట్‌ చేయాలి.
అదేవిధంగా ఉల్లిపాయలు, కాప్సికం, టమాటాలను కూడా పెద్దసైజు (సుమారు అంగుళం సైజు) ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి.
పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి.
తర్వాత కాప్సికం ముక్కలు వేసి కొంచెం మెత్తబడేవరకు వేసి టమాట ముక్కలు వేయాలి.
ఇవన్నీ కలుపుతూ అజినోమోటో, సోయాసాస్‌, టమాటాసాస్‌, చిల్లీసాస్‌ వేసి కలపాలి.
రెండు నిమిషాల తర్వాత గుడ్డు ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి వేసి కొద్దిసేపు వేసి కొత్తిమీర చల్లి దింపేయాలి.
అలాగే స్నాక్‌లా సర్వ్‌ చేయొచ్చు. లేదా నూడుల్స్‌, ఫ్రైడ్‌రైస్‌తో కలిపి సర్వ్‌ చేయొచ్చు.







పాల బొబ్బట్లు తాయారు చేయడం | పాకశాల - Pakashala



కావలసినవి

పాలు-2లీటర్లు
చక్కెర-రెండు కప్పులు,
బాదంపప్పు-15
జీడిపప్పు-15,
యాలకులు-4 


కుంకుమపువ్వు -కొంచెం,
పోళీ చేసేందుకు కావలసినవి
మైదాపిండి-రెండు కప్పులు
సోడా, ఉప్పు, నూనె-కొద్డిగా



తయారుచేసే విధానం : పాలను తక్కువవేడిలో పెట్టి బాగా కాయాలి.
బాదం, జీడిపప్పులను నీటిలో నానబెట్టి మిక్సీలో వేసి లిక్విడ్‌గా చేసుకోవాలి.
పాలు బాగా సగానికి సగం తగ్గిన తర్వాత దాంట్లో చక్కెర, బాదం జీడిపప్పుల లిక్విడ్‌, యాలకులపొడి అన్నీవేసి కలపాలి.
వెడల్పైన పాత్రలో పోసి బాగా ఆరనీయాలి. తర్వాత మైదాపిండితో చిన్న చిన్న పూరీలు చేసి, పాలలో వేయాలి.
5నిమిషాల తర్వాత పాలలో ఊరిన పూరీలను తీసి, ఒక ప్లేట్లో వేసి దానిపై కొంచెం చక్కెరపొడి చల్లి, కుంకుమపువ్ఞ్వతో అలంకరించి సర్వ్‌ చేయాలి.
చాలా రుచికరమైన బొబ్బట్లు ఇవి.







Monday, March 18, 2019

బెండకాయ పెరుగు చట్నీ


బెండకాయ పెరుగు చట్నీ
కావలసిన పదార్థాలు 

Saturday, March 16, 2019

అటుకుల బర్ఫీ తయారు చేయు విధానం


కావల్సిన పదార్థాలు: 

అటుకులు - కప్పు, 
చక్కెర - కప్పు, 

కోవా - కప్పు, 
యాలుకులపొడి - చెంచా, 

గోరువెచ్చని పాలు - పావుకప్పు, 
నెయ్యి పావు కప్పు, 
బాదంపలుకులు కొన్ని.

Monday, February 11, 2019

పన్నీర్ పాయసం






ఉత్తరాది వారు ప్రత్యేక పండగలకి చేసుకునే ప్రసిద్ధ తీపి వంటకం పన్నీర్ పాయసం. పనీర్ ఖీర్ అని కూడా పిలుస్తారు. పన్నీర్, పాలు, గట్టిపడిన పాలు, సువాసననిచ్చే ఏలకుల పొడి, డ్రై ఫ్రూట్లతో తయారుచేస్తారు. దీన్ని పండగలప్పుడే కాక, వ్రతాలప్పుడు కూడా చేస్తారు. గట్టిపర్చిన పాల తియ్యదనం, డ్రైఫ్రూట్ల ముక్కలతో, పన్నీర్ కొంచెం ఉప్పుదనం తగులుతూ మంచి రుచిని అందిస్తాయి. దీన్ని చిటికెలో శ్రమలేకుండా తయారుచేయవచ్చు. చల్లగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది. 

Saturday, February 9, 2019

నిమ్మ కిష్‌తో రొయ్యలు



కీష్, గుడ్లు, పాలు లేక ఒకటి-రెండు పొరల చీజ్ కలిగిన మీగడ, మాంసం, కూరగాయలు,సముద్రపు ఆహరం కలిపిన పేస్ట్రి క్రస్ట్. కీష్ ని వేడిగా అయినా చల్లగా అయిన వడ్డించవచ్చు. ఇది ఫ్రెంచ్ వంటకంలో భాగం అయినప్పటికి, వేరే దేశాలలో కూడా ప్రముఖ పార్టీ వంటకంగా పేరు పొందింది. ఈ వంటకం లో రొయ్యలు కీలకమైన పధార్థము. 

Saturday, January 26, 2019

పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై





సీ ఫిష్ తో వివిధ రకాల వెరైటీ వంటలను వండుతారు. పాంఫ్రెట్ తో వండే ప్రతి ఒక్క వంటా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఈ రోజు మీకు ఒక స్పెషల్ బెంగాలి ఫిష్ రిసిపిని పరిచయం చేస్తున్నాము. దీన్ని తయారుచేయడానికి బట్టర్ ఉపయోగించడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ కలిగి ఉంటుంది. అంతే కాదు, దీన్ని తయారుచేయడం చాలా సులభం మరియు చాలా త్వరగా తయారవుతుంది. 15శాతం ఫ్యాట్ మరియు ప్రోటీనులు అధికంగా ఉంటుంది. ఇందులో జీరో పర్సెంటేజ్ కొలెస్ట్రాల్ ఉండటం వల్ల ఇది హార్ట్ పేషంట్స్ కు చాలా మంచిది.



కావల్సిన పదార్థాలు:


  • పాంఫ్రెట్ ఫిష్(మీడియం సైజ్ ): 3 
  • పసుపు : 1/2 టీస్పూన్ 
  • బ్లాక్ పెప్పర్ పౌడర్ : 1 టీస్పూన్ 
  • నిమ్మరసం: 1టేబుల్ స్పూన్ 
  • పెరుగు (చిక్కగా లేదా గట్టిగా ఉండాలి):2 టేబుల్ స్పూన్ 
  • కరివేపాకు : 8 రెమ్మలు(సన్నగా కట్ చేసుకోవాలి) 
  • కొత్తిమీర (సన్నగా కట్ చేసుకోవాలి): 2 టేబుల్ స్పూన్ 
  • కారం(రెడ్ చిల్లీ పౌడర్ ): 2 టీస్పూన్లు 
  • సోంపు పౌడర్ : 1/2 టీస్పూన్ 
  • బట్టర్ (వెన్న కరగించుకోవాలి): 2 
  • టేబుల్ స్పూన్లు ఉప్పు రుచికి సరిపడా 




తయారుచేయు విధానం:


  • ముందుగా పాంఫ్రెట్ ఫిష్ ను క్లీన్ గా శుభ్రం చేసి పెట్టుకోవాలి. 
  • కొద్దిసేపు పక్కన పెట్టడం వల్ల తేమ పూర్తిగా ఆరిపోతుంది. 
  • చేపలకు చాకుతో అక్కడక్కడ గాట్లు పెట్టాలి.
  • అంతలోపు ఫిష్ కు మ్యారినేట్ చేయడానికి ఒక గిన్నెలో పసుపు, ఉప్పు, నిమ్మరసం, పెప్పర్ పౌడర్ మిక్స్ చేయాలి. 
  • మిక్స్ చేసిన తర్వాత చేపలకు అన్ని వైపులా బాగా పట్టించాలి.
  • ఇప్పుడు మరో గిన్నెలో పెరుగు, కారం, సోంపు పౌడర్, కొత్తిమీర తరుగు, కరివేపాకు అన్ని వేసి మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని కూడా చేపముక్కలకు పట్టించాలి. 
  • చేపముక్కలకు పెట్టిన గాట్లలో కొద్దిగా ఈ మసాలా లోపలికి పోయేలా రుద్దాలి. 
  • ఇలా మ్యారినేట్ చేసిన చేపముక్కలను 1 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టాలి.
  • ఒక గంట తర్వాత చేపముక్కలను బయటకు తీసి, ఫ్రైయింగ్ పాన్ స్టౌమీద పెట్టి, బట్టర్ వేసి కరిగించాలి
  • బట్టర్ కరిగిన తర్వాత మ్యారినేట్ చేసిన చేపను పాన్ లో వేసి అన్ని వైపులా బాగా కాలే వరకూ 8 నుండి 10 నిముషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 
  • మీడియం మంట మీద నిధానంగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ చేయడం వల్ల మరీ డ్రైగా మారుతుంది.
  • తర్వాత పేపర్ టవల్ మీద ఈ చేప ముక్కలను వేయాలి. ఇలా వేయడం వల్ల ఎక్సెస్ ఆయిల్ ను పీల్చుకుంటుంది.
  • అంతే తవా ఫ్రై క్రిస్పీ పాంఫ్రెట్ రెడీ. పుదీనా చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది. ఇది వీకెండ్ డిన్నర్ కు ఫర్ఫెక్ట్ కాంబినేషన్.

చేపలు కొబ్బరి పాల కూర






కావలసిన పదార్థాలు:


  • చేపముక్కలు - అర కేజి
  • కొబ్బరిపాలు - అర కప్పు
  • టమోటా గుజ్జు - 1 కప్పు
  • ఉల్లిపాయలు - 4
  • అల్లం తరుగు - 1 టీ స్పూను
  •  వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను
  •  పచ్చిమిర్చి - 2
  • కరివేపాకు - గుప్పెడు
  • ఆవాలు - 1 టీ స్పూను
  • మెంతులు - 1 టీ స్పూను
  • పసుపు - పావు టీ స్పూను
  • కారం - 2 టీ స్పూన్లు
  • దనియాలపొడి - 1 టీ స్పూను
  • నీరు - 1 కప్పు
  • ఉప్పు - రుచికి తగినంత
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు


తయారుచేసే విధానం:


  • కడాయిలో ఆవాలు, మెంతులు, అల్లం, వెల్లుల్లి, ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు (సగం), పసుపు, కారం, దనియాలపొడి ఒకదాని తర్వాత ఒకటి వేగించి, టమోటా గుజ్జు కలపాలి.
  • 10 నిమిషాల తర్వాత చేపముక్కలు, నీరు కలిపి ముక్కలు ముప్పావు భాగం ఉడికిన తర్వాత కొబ్బరిపాలు, ఉప్పు వేసి సన్నని మంటపై ఉంచాలి. 
  • కూర చిక్కబడ్డాక మిగిలిన కరివేపాకు వేసి మూతపెట్టాలి.