Sunday, December 30, 2018

గోంగూర రొయ్య‌లు


రొయ్య‌ల ప్రై






కావల్సినవి: 

  • రొయ్యలు-పావు కేజీ
  • పసుపు-అర టీస్పూన్‌
  • గరం మసాల పొడి-అర టీస్పూన్‌
  • ఉప్పుు- రుచికి తగినంత
  • ఉల్లిపాయ ముక్కలు-ఒక కప్పుు (చిన్నగా కట్‌ చేసుకోవాలి)
  • కార్న్‌ఫ్లోర్‌-ఒకటిన్నర టీస్పూన్‌
  • మైదా -ఒక టీస్పూన్‌
  • కారం-ఒక టీస్పూన్‌
  • గుడ్డు- ఒకటి
  • అల్లం వెల్లులి పేస్ట్‌-ఒక టీస్పూను
  • కరివేపాకు -రెండు రెమ్మలు
  • కొత్తిమీర కొంచెం
  • పచ్చిమిర్చి- మూడు (పొడవుగా కట్‌ చేసుకోవాలి)
  • నిమ్మకాయ-ఒకటి
  • నూనె-డీప్‌ ఫ్రైకి తగినంత
  • మిరియాల పొడి-అర టీస్పూను

తయారీ :

  • రొయ్యలను నిమ్మకాయ రసం, ఉప్పుు, పసుసు వేసి బాగా కలపి నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • కడిగిన రొయ్యల్లో కొంచెం ఉప్పుు, మిరియాల పొడి, మైదా, కార్న్‌ఫ్లోర్‌, గుడ్డుసొన వేసి బాగా కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ పై కడాయి పెట్టి నూనె వేసుకుని వేడి చేసి ఒక్కో రొయ్యని తీసుకొంటూ నూనెలో వేసుకోవాలి.
  • వీటిని పది నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి.
  • వేగక ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టుకోవాలి.
  • మరో కడాయిలో కొంచెం నూనె వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్‌ వేసుకుని రంగు మారేవరకు వేయించాలి.
  • దీంట్లో చిటికెడు పసుపు, అర టీస్పూన్‌ కారం, ఉప్పు చిటికెడు వేసి బాగా కలపాలి.
  • ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి.
  • వీటితో రొయ్యలు రుచిగా ఉంటాయి.
  • అర టీస్పూన్‌ గరంమసాలా వేసి రొయ్యలకు బాగా పట్టేలా తిప్పాలి.
  • చివర్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసి దించుకోవాలి.

చందువా కూరిన కూర






 కావలసిన పదార్థాలు:


  • చందువాలు - 4
  • నూనె - 2 టే.స్పూన్లు
  • కారం - 6 టీస్పూన్లు
  • జీలకర్ర - 1 టీస్పూను
  • ధనియాలు - ఒకటిన్నర టీస్పూను
  • లవంగాలు - 3
  • మిరియాలు - 10
  • పసుపు - అర టీస్పూను
  • వెల్లుల్లి - 10
  • అల్లం - అంగుళం ముక్క 
  • దాల్చిన చెక్క పొడి - అర టీస్పూను
  • పసుపు - ఒక టీస్పూను
  • చింతపండు పులుసు - 1 టీస్పూను
  • చక్కెర - 1 టీస్పూను
  • వినెగర్‌ - 1/3 కప్పు
  • కొబ్బరి తురుము - 3 టే.స్పూన్లు
  • ఉప్పు - తగినంత.



తయారీ విధానం: 


  • పైన చెప్పిన మసాలాలు, దినుసులన్నీ కలుపుకుని పెట్టుకోవాలి.
  • చేపలను అడ్డంగా కత్తితో లోపలికి కోసుకుని మసాలా కూరాలి.
  • వేడి నూనెలో మీడియం ఫ్లేమ్‌ మీద రెండు వైపులా వేయించుకోవాలి. 
  • అంతే మనకి వేడిగా వేడిగా చందువా కూర రెడీ.

Thursday, November 29, 2018

Andhra Special Poornam boorelu




Poornam boorelu or poornalu are a popular delicacy from Andhra cuisine which is commonly prepared during festivals, wedding and other special occasions. These are called as sukhiyan in malayalam , suyam, suzhiyan or sugunta in other parts of the neighboring states. These are prepared in almost every Telugu speaking home in occassions.

I used old jaggery which is available in ayurvedic stores in India, so it looks very dark. It is believed that old jaggery contains lower amounts of chemical residue that is used during processing.

Sunday, October 7, 2018

స్వీట్‌ కార్న్‌ సూప్‌







కావాల్సిన పదార్థాలు:

స్వీట్‌ కార్న్‌-1 కప్పు
ఉల్లికాడలు-1/2 కప్పు
కూరగాయలు ఉడికించిన నీళ్ళు- 3 కప్పులు
టమాటా సాస్‌-ఐదు చెంచాలు, 
దాల్చిన చెక్క-కొద్దిగా
జీలకర్ర-1 టేబుల్‌ స్పూన్‌
మిరియాలు- 1 టేబుల్‌ స్పూన్‌
ఉల్లిపాయ తరుగు- 1/2 కప్పు
టమాటా -1
పచ్చిమిర్చి -4
ఉప్పు-చిటికెడు
పంచదార -2 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం:


  • ముందుగా ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు తరిగి మిక్సీలో వేసి ముద్దగా చేయాలి. 
  • ఒక శుభ్రమైన వస్త్రంలో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు తీసుకొని మూటలా కట్టాలి. 
  • ఉల్లిపాయ ముద్ద, సుగంధ ద్రవ్యాల మూట, మొక్కజొన్న లను కూరగాయలు ఉడికించిన నీళ్ళలో వేసి పొయ్యి మీద పెట్టాలి. 
  • కొద్ది సేపటి తర్వాత ఉప్పు ఉల్లికాడలు టమాటా సాస్‌ వేసి బాగా మరిగించాలి. సూప్‌ చిక్కగా అవుతుంది. 
  • అప్పుడు సుగంధ దినుసుల మూటను తీసేసి సూప్‌ని వేడివేడిగా తీసుకుంటే చాలా రుచిగా వుంటుంది.

Thursday, October 4, 2018

పొట్లకాయ పెరుగు పచ్చడి





కావాల్సిన పదార్థాలు:

పొట్లకాయ ముక్కలు -3 కప్పులు
పెరుగు -1 కప్పు
ఉల్లిపాయ -1
పచ్చిమిర్చి -3
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు
కరివేపాకు - 5 రెబ్బలు
నూనె - 2 టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి ముక్కలు-1 టేబుల్‌ స్పూన్‌
కొత్తిమీర తరుగు -1కప్పు

తయారుచేసే విధానం:


  • ముందుగా ఒక మందపాటి గిన్నెలో ఒక స్పూన్‌ నూనె, కొద్దిగా నీరు, కొంచెం ఉప్పు వేసి పొట్లకాయ ముక్కల్ని ఉడకబెట్టాలి. 
  • ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. 
  • ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగు, ఉల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 
  • పొట్లకాయ ముక్కలు చల్లారాక వాటిని పెరుగు మిశ్రమంలో కలపాలి. 
  • ఇప్పుడు ఒక ప్యాన్‌లో నూనె వేసి వేడెక్కాక ఎండు మిర్చి, ఆవాలు, కరివేపాకు, జీలకర్ర వేసి పోపు సిద్ధం చేసుకోవాలి. 
  • కొద్దిగా చల్లారాక పెరుగు పచ్చడి మిశ్రమంలో పోపును కూడా వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకోవాలి. 
  • పెరుగు పచ్చడి అన్నంతో పాటు తింటే రుచిగా ఉంటుంది

Saturday, September 29, 2018

చిల్లీ మష్రూమ్‌







కావాల్సిన పదార్థాలు: 

బటన్‌ మష్రూమ్స్‌- 200గ్రా, 
క్యాప్సికమ్‌- రెండు, 
ఉల్లిపాయ- ఒకటి, 
అల్లం- అంగుళం ముక్క, 
వెల్లుల్లి- ఆరు రెబ్బలు, 
నూనె- రెండు టేబుల్‌ స్పూన్లు, 
కారం- టీస్పూను, 
సోయాసాస్‌- రెండు టీస్పూన్లు, 
కార్న్‌ఫ్లోర్‌- టేబుల్‌స్పూన్‌, 
వెనిగర్‌- టీ స్పూన్‌, 
మంచినీళ్లు- కప్పు, 
ఉప్పు-రుచికి సరిపడా.

తయారుచేసే విధానం: 


  • పుట్టగొడుగుల్ని రెండు ముక్కలుగా కోయాలి. 
  • క్యాప్సికమ్‌ లోపలి గింజలు తీసేసి ముక్కలుగా కోయాలి. 
  • ఉల్లిముక్కలు, అల్లం, వెల్లుల్లి కలిపి మెత్తని ముద్దలా రుబ్బాలి. 
  • పాన్‌లో నాలుగు టేబుల్‌స్పూన్ల నూనె వేసి ఉల్లిముద్ద వేసి బాగా వేయించాలి. 
  • తరవాత కారం వేసి, అరకప్పు నీళ్లు పోసి సిమ్‌లో పెట్టి ఉడికించాలి. 
  • ఇప్పుడు క్యాప్సికమ్‌ ముక్కలు, పుట్టగొడుగుల ముక్కలు, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి, తక్కువ మంటమీద ముక్కలు ఉడికే వరకూ ఉంచాలి. 
  • తరవాత సోయాసాస్‌, వెనిగర్‌ వేసి కలపాలి. కాసిని నీళ్లల్లో కలిపిన కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి కలిపి సిమ్‌లో ఓ రెండు నిమిషాలు ఉడికించి, దించాలి.

స్వీట్‌ బన్స్‌




కావలసిన పదార్థాలు: 

బంగాళదుంపలు - 5, 
గిలకొట్టిన గుడ్డు - ఒకటి, 
పాలు - ముప్పావు కప్పు, 
పంచదార - టేబుల్‌ స్పూను, 
మైదా - కప్పు, 
చికెన్‌ ఎసెన్స్‌ (సూపర్‌ మార్కెట్లో దొరుకుతుంది) - టేబుల్‌ స్పూను, 
నూనె - 5 టేబుల్‌ స్పూన్లు.

తయారుచేసే విధానం: 


  • బంగాళదుంపల్ని మెత్తగా ఉడికించి తొక్కతీసి చిదిమి పెట్టుకోవాలి. 
  • ఒక పాత్రలో పంచదార, పాలు, గిలకొట్టిన గుడ్డు, చికెన్‌ ఎసెన్స్‌ వేయాలి. 
  • పంచదార కరిగాక మైదా, బంగాళదుంపల గుజ్జుని ఒకదాని తర్వాత ఒకటి వేసి బాగా కలపాలి. 
  • ఈ మిశ్రమాన్ని ఎనిమిది భాగాలుగా విభజించి కచోరీలా చేత్తో వత్తి, పెనంపై నూనె వేసి, రెండువైపులా దోరగా వేయించాలి. 
  • వీటిని టమోటా సాస్‌తో తింటే భలే బాగుంటాయి.